లండన్ : ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ చేతికి స్వల్ప గాయమైంది. పంత్ ఎడమ మోచేతి వద్ద దెబ్బతగలడంతో అక్కడే ఉన్న ఫిజియోలు అతడికి ప్రథమ చికిత్స అందించి పంత్‌ను అక్కడ్నుంచి తీసుకెళ్లారు.
దీంతో టీమ్ఇండియా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ సోమవారం పంత్ యథావిధిగా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన తనదైన శైలిలో సిక్సర్లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.