లక్నో: ఆర్సీబీతో జరిగిన ఐపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant) సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈసారి ఐపీఎల్లో పెద్దగా ఫామ్‌లో లేని పంత్.. లీగ్ చివరి మ్యాచ్‌లో మాత్రం తన స్ట్రోక్ ప్లేతో అలరించాడు. సెంచరీ పూర్తి అవ్వగానే బ్యాట్‌ను, హెల్మెట్‌ను పక్కన పడేసి.. గాలిలో పల్టీ కొట్టాడు పంత్. జిమ్నాస్ట్ తరహాలో గాలిలో ఎగిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సీజన్ ఐపీఎల్లో పంత్ తన బ్యాటింగ్ పవర్ చూపించలేకపోయాడు. ఎట్టకేలకు లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ మ్యాచ్‌లో పంత్ 118 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంత్ సెలబ్రేషన్‌కు చెందిన వీడియోను మీరూ వీక్షించండి.
🚨 COLDEST CELEBRATION IN IPL 2025 BY RISHABH PANT 🚨
– The main man is Back…!!!! pic.twitter.com/cAOQtvPfa7
— Johns. (@CricCrazyJohns) May 27, 2025
పంత్ సెంచరీ చేసినా ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఆ మ్యాచ్‌లో బెంగుళూరు ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు.. రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగగా మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మరో 8 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నది. జితేశ్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో ఆర్సీబీ ఖాతాలో విక్టరీ పడింది. జితేశ్ 85 నాటౌట్, కోహ్లీ 54 రన్స్ చేశారు.
COLDEST IPL CENTURY CELEBRATION.
– This is Rishabh Pant special. 😍❤️pic.twitter.com/0RWA1B2BYi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2025