ముంబై: ఇండియన్ బ్యాటర్ రిషబ్ పంత్( Rishabh Pant) .. ముంబై టెస్టులో ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పంత్ 60 రన్స్ చేసి నిష్క్రమించాడు. కివీస్ స్పిన్నర్ ఇస్ సోథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి టర్న్ అయి పంత్ ఫ్రంట్ ప్యాడ్‌ను తాకింది. అంపైర్ ఔట్ ఇవ్వగా, రిషబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే థార్డ్ అంపైర్ కూడా ఔట్‌గా డిక్లేర్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయిదో వికెట్‌కు గిల్, పంత్ 96 రన్స్ జోడించారు.
భోజన విరామ సమయానికి ఇండియా 43 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. స్పైడర్‌క్యామ్‌తో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. వాంఖడే స్టేడియంలో ముందుగానే ఆటగాళ్లను లంచ్‌కు వెళ్లారు. భారత్ ఇంకా 40 రన్స్ వెనుకబడి ఉన్నది. గిల్ 70, జడేజా 10 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Sodhi breaks the Gill/Pant partnership! A fuller delivery that breaks back in, misses the bat and traps Pant LBW for 60. India 180/5 trail by 55. Follow play LIVE in NZ on @skysportnz or @SENZ_Radio LIVE scoring https://t.co/VaL9TehXLT 📲 #INDvNZ #CricketNation pic.twitter.com/2OATWi2R9m
— BLACKCAPS (@BLACKCAPS) November 2, 2024