Rishabh Pant : అవసరంలో ఉన్నప్పుడు సాయం చేసినవాళ్లను మర్చిపోలేం. అదే ఆపదలో ఉన్నప్పుడు చేయందించి కాపాడినవాళ్లను అయితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. వాళ్ల రుణం తీర్చుకునే అవకాశం వస్తే ముందుంటాం. భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఇప్పుడు అదే పని చేశాడు. రెండేండ్ల క్రితం కారు యాక్సెండెంట్ సమయంలో తన ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులకు మర్చిపోలేని బహుమతులు అందించాడు. కారులోంచి బయటకు రాలేని స్థితిలో ఉన్న తనను ధైర్యం చేసి బయటకు లాగిన రజత్, నిషు అనే ఇద్దరు కుర్రాళ్లకు స్కూటీలను కానుకగా ఇచ్చి సంబురపడిపోయాడు పంత్.
అసలేం జరిగిందంటే.. కొత్త సంవత్సరం వేడుకలో పాల్గొనేందుకు పంత్ 2022 డిసెంబర్ 31న కారులో ఇంటికి బయల్దేరాడు. ఢిల్లీ – డెహ్రడూన్ రహదారిపై వెళ్తున్న అతడి మర్సిడెస్ కారు రూర్కీ సమీపంలోని హమ్మద్‌పూర్ ఝాల్ (Hammadpur Zhal) వద్ద యాక్సిడెంట్‌కు గురైంది. వేగంగా వెళ్తున్న అతడి కారు రెయిలింగ్‌కు ఢీకొని అమాంతం బోల్తా పడింది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. కారులోనే చిక్కుకుపోయిన పంత్‌కు నుదురు, కాలికి కాలిన గాయాలయ్యాయి.
Rishabh Pant gifted two wheeler vehicle to Rajat and Nishu ❤️
Thank you Rajat and Nishu ( They were the first responders on that horrific day ). We are indebted to you.#RishabhPant pic.twitter.com/Zb3Haj75zF— Naman (@Im_naman__) November 23, 2024
కారులోంచి మంటలు రావడం గమనించిన రజత్, నిషు అనే కుర్రాళ్లు కారు అద్ధాలు పగలగొట్టి పంత్‌ను బయటకు లాగారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అలా.. పంత్‌ను డెహ్రాడూన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిల్ పంత్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. అక్కడి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)కి వెళ్లిన పంత్.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కష్టమైన వ్యాయామాలు చేసి తక్కువ సమయంలోనే ఫిట్‌గా అయ్యాడు.
Rishabh Pant gifted scooters to two boys who rescued him after his horrific accident ❤️
📸: 7Cricket#RishabhPant #CricketTwitter pic.twitter.com/zXr9UTEqu0
— InsideSport (@InsideSportIND) November 23, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగి సత్తా చాటాడు. ఆపై టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు బ్యాటింగ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో సూపర్ సెంచరీ.. ఇలా పంత్ తనలో మునపటి చేవ తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ పంత్ కీలక బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు.