లండన్ : ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా లండన్ చేరుకున్నది. గిల్ నేతృత్వంలోని భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant).. ప్రాక్టీస్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. అతని పవర్ షాట్‌కు.. స్టేడియంలో పైకప్పు పగిలింది. వాషింగ్టన్ సుందర్ వేసిన బౌలింగ్‌లో.. రిషబ్ పంత్ భారీ షాట్ కొట్టాడు. బెకన్హమ్ స్టేడియంలో ఉన్న పైకప్పుకు రంధ్రం పడింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇండియన్ టీమ్ ఇన్‌స్టా అకౌంట్లో ప్లేయర్ల ప్రాక్టీస్ వీడియోలను పోస్టు చేశారు. గిల్, పంత్, బుమ్రా, సిరాజ్, జడేజా ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్.. ప్లేయర్లతో మాట్లాడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. గిల్, పంత్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. సిరాజ్, బుమ్రాలు .. బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. ప్లేయర్లతో డ్రిల్ ప్రాక్టీస్ చేయించాడు. గిల్ బ్యాటింగ్.. బుమ్రా బౌలింగ్ సెషన్లో చాలా సేపు సాగింది.
ఇంగ్లండ్‌తో జూన్ 21 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానున్నది. లీడ్స్, బర్మింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్, మాంచెస్టర్‌లో టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.
Rishabh Pant breaking the roof with his six. 😲pic.twitter.com/ZkVjahRad6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2025