న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. గాయమైన భాగాలకు సర్జరీ అవసరమైనందున పంత్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం విలేకర్లకు తెలిపాడు.
ముంబైలోని అంబానీ దవాఖానలో ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దివాలా పర్యవేక్షణలో పంత్‌కు శస్త్రచికిత్స అందించనున్నారు. పంత్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాడైనందున అతనికి వైద్య చికిత్స అందించే బాధ్యత తమదేనని బోర్డు పేర్కొన్నది.