Shubman Gill – Ridhima Pandit : భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)తో పెండ్లి వార్తలపై బాలీవుడ్ నటి రిధిమా పండిట్(Ridhima Pandit) స్పందించింది. అసలు తనకు శుభ్‌మన్ గిల్ ఎవరో తెలియదని, అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ‘నాకు వ్యక్తిగతంగా గిల్‌తో ఎలాంటి సాన్నిహిత్యం లేదు. అలాంటప్పుడు నేను అతడిని పెలా పెండ్లా చేసుకుంటాను. అలాంటి వార్తలు ప్రచారం కావడం చూస్తుంటే చిర్రెత్తుకొస్తుంది’ అని రిధిమా తనపై వైరల్ అవుతున్న గాసిప్స్‌కి చెక్ పెట్టింది.
‘నాకు పొద్దు పొద్దున్నే చాలా మంది జర్నలిస్ట్‌లు ఫోన్లు చేస్తున్నారు. నా జీవితంలో ఇలా ఇంతకుముందు జరుగలేదు. చాలామంది నా పెండ్లి గురించే ఆసక్తిగా అడుగుతున్నారు. అయితే.. వాళ్లు ఊహించుకున్నటు శుభ్‌మన్ గిల్‌తో నా వివాహం జరుగట్లేదు’ అని రిధిమా కుండబద్ధలు కొట్టింది. ముంబైలో పుట్టి పెరిగిన రిధిమా హిందీలో పలు టీవీ షోల్లో మెప్పించింది. అంతేకాదు ‘ఖత్రోంకే ఖిలాడీ’, ‘బిగ్ బాస్’ లైవ్ షోలో సైతం పాల్గొన్నది.
#RidhimaPandit Says ‘Don’t Even Know #ShubmanGill‘ Amid Reports Of December Wedding With Cricketer@PanditRidhima @ShubmanGill https://t.co/P5o8Eg0XvR
— Free Press Journal (@fpjindia) June 1, 2024
మరోవైపు.. భారత ఓపెనర్ గిల్‌పై గాసిప్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar), బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్(Sara Ali Khan)లతో అతడు ప్రేమలో ఉన్నాడనే వార్తలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
గిల్, సారా టెండూల్కర్
ప్రస్తుతం గిల్ టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లాడు. నిరుడు దంచికొట్టిన అతడు ఆ తర్వాత తేలిపోయాడు. ఐపీఎల్ (IPL 2024) పదిహేడో సీజన్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో, రెగ్యులర్ ఓపెనర్‌గా జట్టులో ఉండాల్సిన అతడు మెగా టోర్నీకి ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. జూన్ 1 న వరల్డ్ కప్ షురూ కానుండగా.. టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.