TGPSC | తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్..! హాల్ టికెట్స్ వచ్చేశాయ్..!
TGPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.
TGPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనున్నది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4.03లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అభ్యర్థుల్ని అనుమతించనుండగా.. పది దాటితే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Group 1
- Telangana
- Telugu News
- TGPSC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

