Chris Woakes : యాషెస్ హీరోగా పేరొందిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes) అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై మూడు నెలలు దాటింది. దాంతో, ఇంగ్లీష్ జట్టులో కీలక ఆటగాడైన వోక్స్‌కు ఏమైంది? ఎందుకు ఆడట్లేదు? అని అభిమానులు అందోళన మొదలైంది. ఈ సమయంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ తన గైర్హాజరీకి కారణం ఏంటో తెలిపాడు. తన తండ్రి మరణించాడని, అందుకే ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చిందని ఎక్స్ వేదికగా వోక్స్ వెల్లడించాడు.
‘నేను ఇంగ్లండ్, వార్విక్షైర్ జట్లకు ఆడడం చూసి మా నాన్న ఎంతో గర్వపడ్డాడు. భవిష్యత్తులోనూ నా అంతర్జాతీయ కెరీర్‌ను చూసి పొంగిపోవాలని అనుకున్నాడు’ అని వోక్స్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘మే నెలలో దురదృష్టవశాత్తూ మా నాన్న రోజర్ వోక్స్(Roger Woakes) కన్నుమూశారు. ఆ మాసం మాకు ఎంతో కష్టంగా గడిచింది. కొన్ని వారాలుగా నేను అత్యంత సన్నిహితులతో గడిపాడు.
England’s Chris Woakes Takes Break From Cricket After Father’s Death#Cricket #CricketUpdates pic.twitter.com/3zA9jTyE42
— Cricket Clue (@cricketclue247) June 1, 2024
మా జీవితంలో కష్టమైన దశ నుంచి బయటపడేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మళ్లీ నేను త్వరలోనే మళ్లీ ఇంగ్లండ్, వార్విక్షైర్ జట్లకు ఆడుతాను అని వోక్స్ తన భావోద్వేగాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఐపీఎల్ పదిహేడో సీజన్ (IPL 2024)లో వోక్స్‌ను పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు కొన్నది. అయితే.. తండ్రి అనారోగ్యం కారణంగా అతడు టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. దాంతో, వోక్స్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌కి ఎంపిక కాలేదు.