IND vs SL : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్(Tri Nation Series)లో జోరుమీదున్న భారత మహిళల జట్టుకు పెద్ద షాక్. వరుసగా రెండు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన శ్రీలంక(Srilanka) చేతిలో ఓటమి పాలైంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరరకూ ఉత్కంఠ నెలకొనగా లంక 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రీచా ఘోష్(58) అర్థ శతకానికి జెమీమా రోడ్రిగ్స్(37) మెరుపులు తోడవ్వగా భారత్ 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలోనీలాక్షి డిసిల్వా(56), హర్షిత సమరవిక్రమ(53)లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
మహిళల వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టుకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో అజేయంగా దూసుకెళ్తున్న హర్మన్‌ప్రీత్ సేనను ఓడించింది. తొలి పోరులో కంగుతిన్న అనూహ్యంగా పుంజుకొని ఈసారి టీమిండియాకు షాకిచ్చింది. గత రెండు మ్యాచుల్లో రెచ్చిపోయి ఆడిన ఓపెనర్లు ప్రతీకా రావల్(35), స్మృతి మంధాన(18)లు మరోసారి దంచేశారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యంతో లంకపై ఒత్తిడి పెంచారు.
Richa rampage 💪🏽
6️⃣th ODI fifty for Richa Ghosh in it comes in quick time!#WomensTriNationSeries2025 pic.twitter.com/TZfHcki8SN
— Women’s CricZone (@WomensCricZone) May 4, 2025
అయితే.. మంధాన రనౌట్‌గా వెనుదిరిగాక.. ఇనొకా రణవీర ఓవర్లో ప్రతీకా ఎల్బీగా ఔట్ అయింది. 59కే ఓపెనర్లు డగౌట్ చేరిన వేళ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30), జెమీమా రోడ్రిగ్స్(37) లు జట్టు స్కోర్ 100 దాటించారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక రీచా ఘోష్(58) మెరుపు బ్యాటింగ్‌తో లంక బౌలర్లను హడలెత్తించింది. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో బీభత్సం సృష్టించిన రీచా జట్టు స్కోర్ 233 వద్ద డగౌట్ చేరింది. ఆ తర్వాత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(24), కష్వీ గౌతమ్(17)లు ధనాధన్ ఆడడంతో ప్రత్యర్థికి భారత్ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
టీమిండియా నిర్దేశించిన 279 పరుగుల ఛేదనలో లంక ఓపెనర్లు హాసిని పెరీరా(22), విష్మీ గుణరత్నే(33)లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 30 రన్స్ జోడించిన హాసిని.. దీప్తి శర్మ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(53), కెప్టెన్ చమరి ఆటపట్టు(23) భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికించారు. ప్రతీకా రావల్ బౌలింగ్‌లో అరుంధతీ సూపర్ క్యాచ్‌తో హర్షిత పెవిలియన్ చేరింది. ఉన్నంతసేపు బౌండరీలతో హడలెత్తించిన ఆటపట్టును స్నేహ్ రానా ఔట్ చేసింది. అయితే.. కవిశ దిల్హరి(23) జతగా నీలాక్షి డిసిల్వా(0) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది.
Sri Lanka beat India for the first time in women’s ODIs in seven years and only the third time in 34 attempts!
🔗 https://t.co/fbcs44L9XL pic.twitter.com/rbFh3KWUos
— ESPNcricinfo (@ESPNcricinfo) May 4, 2025
ఇండియా స్పిన్నర్లు, పేసర్లను కాచుకొన్న తను అర్ధ శతకంతో చెలరేగింది. దంచికొడుతున్న నీలాక్షిని నల్లపురెడ్డి చరణి ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కానీ, టెయిలెండర్లు అనుష్క సంజీవని(23 నాటౌట్), సుగంధిక కుమారి(19 నాటౌట్)లు అజేయంగా నిలబడి జట్టుకు 3 వికెట్ల విజయాన్ని అందించారు. గత పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన లంకకు ఇది రెండో విక్టరీ.