రాంచీ: రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. (Car Explodes) దీంతో మంటల్లో కాలి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. కద్మా ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ కారును రోడ్డుపై ఆపాడు. ఆ కారు డిక్కీలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆ మంటల్లో కారు కాలిపోయింది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
కాగా, ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం అక్కడకు చేరుకున్నారు. మృతుడ్ని సునీల్ అగర్వాల్‌గా గుర్తించారు. కారు పేలిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जमशेदपुर के कदमा थाना क्षेत्र के मरीन ड्राइव पर एक दर्दनाक हादसा हुआ, जहां चलती कार में रखा घरेलू गैस सिलेंडर फट गया.#Jharkhand #jamshedpur pic.twitter.com/IWFLsWGPc2
— News Ranchi 🛑 (@newsranchi) May 4, 2025
Jharkhand: An incident occurred in Jamshedpur when a domestic gas cylinder exploded in a moving car, engulfing the vehicle in flames. The person inside the car was burned to death and the car was completely destroyed. The police arrived to investigate the matter. The deceased was… pic.twitter.com/S6Jo4ZaXFN
— IANS (@ians_india) May 4, 2025