Sudheer- Rashmi | బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న జంటలలో సుడిగాలి సుధీర్, రష్మీ జంట ఒకటి. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ అంటే కేరాఫ్ జబర్దస్త్ కామెడీ షో అనే చెప్పాలి. వీళ్ళకు గుర్తింపు తీసుకొచ్చింది ఈ షోనే. అంతకుముందు సుధీర్, రష్మి అంటే ఎవరో కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. జబర్ధస్త్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రష్మీ, సుధీర్లకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వీరిద్దరు రియల్ లవర్స్ అన్న మాదిరిగా బిల్డప్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. గత తొమ్మిదేళ్లుగా ఈ ఇద్దరు తమ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇద్దరూ ఒక షోలో కనిపించినా, ఇద్దరూ కలిసి ఈవెంట్ చేసినా, ఈ ఇద్దరి మీదే ఈవెంట్ చేసినా అది సూపర్ హిట్ కావల్సిందే.
మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట ఇటీవల ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు. మల్లెమాల, ఈటీవీ ప్రోగ్రాంలలో రష్మీ సుధీర్ జంటగా కనిపించింది చాలా తక్కువ. జబర్ధస్త్, ఢీ షోలలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించేవారు. అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఏ ప్రోగ్రాం చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఒకరంటే ఒకరికి పడడం లేదనే ప్రచారాలు కూడా సాగాయి. రష్మీ గౌతమ్ ఎన్ని సార్లు ఫోన్ చేసిన కూడా సుధీర్ పట్టించుకోవడం లేదని, హీరో అయ్యాక సుధీర్.. ఆమెని దూరం పెట్టాడని ఎన్నో ప్రచారాలు సాగేవి. వీటిపై తాజాగా రష్మీ స్పందించింది.
మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే తప్పక కలుస్తాము. అప్పుడు ప్రొఫెషనల్ గానే ఉంటామని చెప్పుకొచ్చింది. సుధీర్ తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు కాలేదు. మేము కలిసి పని చేయాలని కాబట్టి కోపతాపాలకి పోయే అవకాశం లేదు.తిరిగి ఇద్దరు బుల్లితెరపై కలిసి సందడి చేసే అవకాశం ఉందా అని అడగ్గా, అందుకు స్పందించిన రష్మీ గౌతమ్.. అది నా చేతిలో లేదు. ఆ నిర్ణయాలు సుధీర్ వ్యక్తిగతం కూడా. వాటి గురించి నేను ఏమి మాట్లాడలేను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో అలరిస్తుండగా, సుధీర్ ఫ్యామిలీ స్టార్ షోతో సందడి చేస్తున్నారు.