82 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ
అత్యాధునిక వసతులతో హైదరాబాద్ గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అత్యాధునిక వసతులతో హైదరాబాద్ గచ్చిబౌలిలో 82 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2028 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు.భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గురువారం గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలను సీఎం అందజేశారు. షూటర్ ఈషా సింగ్‌కు రూ. 3.3 కోట్లు, పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ. 50 లక్షలు, బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు రూ. 2.10 కోట్లు, బాక్సర్ నిఖత్ జరీన్‌కు కు రూ. 60 లక్షలతో పాటు తనిష్క్ నాయుడు (షూటింగ్- రూ. 53.65 లక్షలు), సురభి భరద్వాజ్ (షూటింగ్-రూ. 10 లక్షలు) నగదు ప్రోత్సాహకాల చెక్కులు అందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

