INDW vs SLW : పొట్టి సిరీస్‌లో జోరు మీదున్ను భారత జట్టు త్రివేండ్రంలోనూ శ్రీలంకకు చుక్కలు చూపిస్తోంది. టాస్ ఓడిన ప్రత్యర్థిని బౌలర్లు బెంబేలెత్తిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. పవర్ ప్లేలోనే రేణుకా సింగ్(3-21) విజృంభణతో లంక మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో రెండు వికెట్లు తీసిన రేణుక పర్యాటక జట్టును గట్టి దెబ్బ కొట్టింది. దో ఓవర్లో నీలాక్షి డిసిల్వా (4)ని ఎల్బీగా ఔట్ చేసిన రేణుక లంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది.
వైజాగ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక చావోరేవో పోరులోనూ తేలిపోతోంది. ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభినప్పటికీ భారత బౌలర్ల విజృంభణతో లంక టాపార్డర్ ఢమాల్‌మంది. దంచేస్తున్న చమరి ఆటపట్టు(3)ను ఔట్ చేసి దీప్తి శర్మ తొలి బ్రేకిచ్చింది.
Two in an over for Renuka Singh Thakur!
What a start this for #TeamIndia 😎
Sri Lanka 32/3 after 6 overs
Updates ▶️ https://t.co/Vkn1t7b6Dm#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/NRejol0lti
— BCCI Women (@BCCIWomen) December 26, 2025
బౌండరీలతో చెలరేగుతున్న హాసిని పెరీరా(25), డేంజరస్ హర్షిత సమరవిక్రమ(2)లను ఒకే ఓవర్లో వెనక్కి పంపింది. రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసింది. దాంతో.. 32కే లంక మూడు బిగ్ వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ దశలో ఇమేశా దులానీ (3 నాటౌట్)తో కలిసి భాగస్వామ్యంతో జట్టును ఆదుకోవాలనుకున్న నీలాక్షి డిసిల్వా(4)ని రేణుక ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. దాంతో.. 10 ఓవర్లకు లంక స్కోర్. 45-4.