INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లోనూ భారత పేసర్ రేణుకా సింగ్ రెచ్చిపోతోంది. తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది. ఆ తర్వాత.. రుబియా హైదర్(13), షర్మీన్ అక్తర్(15) ఆచితూచి ఆడి స్కోర్ 30 దాటించారు. అయితే.. రేణుక వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రుబియా స్లిప్‌లో షాట్ ఆడగా.. శ్రీచరణి క్యాచ్ నేలపాలు చేసింది. కానీ, ఆ తర్వాతి ఓవర్లో దీప్తి శర్మ ఔట్ చేసింది. దాంతో.. 34 వద్దే బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది.
డీవై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్‌పై నిప్పులు చెరిగిన రేణుకా సింగ్ బంగ్లాదేశ్‌పైనా చెలరేగుతోంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది. చివరి బంతికి షార్ట్ థర్డ్‌మ్యాన్‌లో ఆడిన అక్తర్.. అక్కడే కాచుకొని ఉన్న శ్రీ చరణి చేతికి చిక్కింది. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాను రుబియా హైదర్(13), షర్మీన్ అక్తర్(15 నాటౌట్) ఆదుకున్నారు. కానీ.. వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేస్తూ పవర్ ప్లే ముగియగానే రెండో వికెట్ అందించింది దీప్తి శర్మ.
Opening over 🤝 Opening wicket
Renuka Singh Thakur strikes early for #TeamIndia 👏
Updates ▶ https://t.co/lkuocSlGGJ#WomenInBlue | #CWC25 | #INDvBAN pic.twitter.com/ss8IbGsO0T
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో సెమీస్ ఫైట్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది టీమిండియా. ఇరుజట్ల మధ్య డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న చివరి లీగ్ దశ పోరు టాస్ పడగానే అందుకున్న వాన దాదాపు గంటన్నర తర్వాత శాంతించింది. దాంతో.. ఊపిరిపీల్చుకున్న సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్దం చేస్తున్నారు. గంటన్నర సమయం వృథా అయినందున ఓవర్లను తగ్గించి ఆడిస్తున్నారు అంపైర్లు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి.. 43 ఓవర్ల మ్యాచ్ సాధ్యపడుతుందని చెప్పారు.