RCBW vs UPWW : భారీ స్కోర్ల మ్యాచ్‌లు, ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లర్లతో అభిమానులు అలరిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో బిగ్ ఫైట్‌కు వేళైంది. ఆరంభ పోరులో ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్(UP Warriorz)ను ఢీ కొడుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఛేదనకు మొగ్గు చూపి బౌలింగ్ తీసుకుంది.
డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ తొలి పోరులో ఓటమి అంచుల నుంచి అనూహ్యంగా విజయభేరి మోగించింది ఆర్సీబీ. 155 పరుగుల ఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. ఆల్‌రౌండర్ నదినే డీ క్లెర్క్(63 నాటౌట్) మెరుపులతో ముంబైకి ఝలక్ ఇచ్చింది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడింది యూపీ.
Inching closer to Match 5⃣ ⌛️
Who are you backing tonight? 🤔
💻 https://t.co/rG3cQadgHN
📱 Official WPL App #TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/LuuXCZIlho— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), దయలాన్ హేమలత, గౌతమీ నాయక్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీక్లెర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.
యూపీ వారియర్స్ తుది జట్టు : కిరణ్ నవ్‌గిరే, మేగ్ లానింగ్(కెప్టెన్), ఫొబే లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్(వికెట్ కీపర్), డియాండ్ర డాటిన్, సోఫీ ఎకిల్‌స్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని మేగ్ లానింగ్ బృందం పట్టుదలతో ఉంది. దాంతో.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. బెంగళూరుకు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన, రీచా ఘోష్, డీక్లెర్క్… యూపీకి లానింగ్, లిచ్‌ఫీల్డ్, కిరణ్ నవ్గరే, బేత్ మూనీలు కీలకం కానున్నారు. బెంగళూరు ఒక మార్పుతో ఆడనుండగా.. యూపీ మాత్రం ఏ మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది.