IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ పోరుకు వేళైంది. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది. టైటిల్ వేటకు అడుగు దూరంలో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు క్వాలిఫయర్ 1లో తలపడుతున్నాయి. ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి రజత్ పటిదార్ బౌలింగ్ తీసుకున్నాడు.
లీగ్ దశలో అదరగొట్టిన ఈ రెండు జట్లు ప్రస్తుతం 19 పాయింట్లతో టేబుల్ టాపర్లుగా నిలిచాయి. చివరి మ్యాచులో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన శ్రేయాస్ అయ్యర్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు ఆర్సీబీ కూడా లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 228 పరుగుల ఛేదనలో దుమ్మురేపింది. దాంతో.. రెండు జట్ల మధ్య క్వాలిఫయర్ 1 హోరాహోరీగా సాగడం ఖాయం.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Qualifier 1⃣
Updates ▶ https://t.co/aHIgGazpRc#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile pic.twitter.com/qsBei0DQqG
— IndianPremierLeague (@IPL) May 29, 2025
కీలకమైన పోరు కావడంతో పంజాబ్, బెంగళూరు తమ తుది జట్టులో ఒక్కో మార్పుతో ఆడుతున్నాయి. పేసర్ మార్కో యాన్సెస్ స్థానంలో అజ్మతుల్లా ఒయర్జాయ్ను పంజాబ్ తీసుకుంది. ఆర్సీబీ తమ ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను తుషార బదులు ఆడిస్తోంది.
ఆర్సీబీ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ : మయాంక్ అగర్వాల్, రసిక్ దార్ సలాం, మనోజ్ భాండగే, టిమ్ సీఫర్ట్, స్వప్నిల్ సింగ్.
The spotlight doesn’t get brighter than this 🔥
Everything they’ve played for leads to this 🏆
Punjab Kings 🆚 Royal Challengers Bengaluru 👊
Are you ready? 🫵#TATAIPL | #PBKSvRCB | #Qualifier1 | #TheLastMile pic.twitter.com/ohavg1Zn3i
— IndianPremierLeague (@IPL) May 29, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, కైలీ జేమీసన్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : విజయ్ కుమార్, ప్రవీణ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్.