IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌పై గురి పెట్టింది. గతంలో మూడుసార్లు ఆఖరి మెట్టుపై తడబడిన ఆర్సీబీ ఈసారి కప్ కలను సాకారం చేసుకోవాలనే కసితో ఉంది. అందుకోసమే.. కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు పేస్ దళాన్ని పటిష్టం చేసుకునే పనిలో పడింది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ప్రధాన పేసర్లు లుంగి ఎంగిడి (Lungi Ngidi) జట్టును వీడనున్న నేపథ్యంలో అతడి స్థానాన్ని పేస్ సంచలనంతో భర్తీ చేసింది.
జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబని (Blessing Muzarabani)కి తమ స్క్వాడ్‌లో చోటు కల్పించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘ఆరు అడుగుల 8 అంగుళాల పొడవుండే బ్లెస్సింగ్ ముజరబని తాత్కాలిక ప్లేయర్‌గా స్క్వాడ్‌తో కలువనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్ స్క్వాడ్‌కు ఎంపికైన లుంగి ఎంగిడి మే 26న స్వదేశం వెళ్లనున్నాడు.
🔊 𝑶𝑭𝑭𝑰𝑪𝑰𝑨𝑳 𝑨𝑵𝑵𝑶𝑼𝑵𝑪𝑬𝑴𝑬𝑵𝑻 🔊
6 feet 8 inches tall, 28 year old Zimbabwean speedster – 𝗕𝗹𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗠𝘂𝘇𝗮𝗿𝗮𝗯𝗮𝗻𝗶 has been announced as RCB’s temporary replacement for Lungi Ngidi who returns to South Africa on the 26th! Lungi continues to be… pic.twitter.com/vn5GBSPShi
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 19, 2025
అతడి స్థానంలో 28 ఏళ్ల ఈ జింబాబ్బే పేసర్ ప్లే ఆఫ్స్ మ్యాచులు ఆడనున్నాడు’ అని ఆర్సీబీ తెలిపింది. ఈమధ్యే బంగ్లాదేశ్‌పై 10 వికెట్లతో మెరిసిన బ్లెస్సింగ్ తొలిసారి ఐపీఎల్లో తన పేస్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇంతకుముందు ఈ స్పీడ్‌స్టర్ లక్నో సూపర్ జెయింట్స్ (Luckonw Super Gaints) జట్టుకు నెట్ బౌలర్‌గా సేవలందించాడు. అప్పుడు లక్నో హెడ్‌కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్(Andy Flower) ప్రస్తుతం ఆర్సీబీకి కోచింగ్ ఇస్తున్నాడు. అప్పుడు బ్లెస్సింగ్‌తో ఉన్న పరిచయం, అతడి ఫామ్ దృష్ట్యా స్క్వాడ్‌లోకి తీసుకునేందుకు బెంగళూరు యాజయాన్యం అంగీకరించింది.
టీ20ల్లో బ్లెస్సింగ్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకూ 7.28 ఎకనామీతో 127 వికెట్లు పడగొట్టాడీ పొడగరి పేసర్. అత్యుత్తమ ప్రదర్శన 3-8. జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా మారిన బ్లెస్సింగ్ ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల మ్యాచ్ ఆడనున్నాడు. మే 22 నుంచి మే 25 వరకు జరిగే ఈ గేమ్ తర్వాత అతడు ఆర్సీబీ స్క్వాడ్‌లో చేరుతాడని సమాచారం. జింబాబ్వేకు చెందిన ఈ యువ పేసర్ ప్లే ఆఫ్స్ పోరులో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ దూరం కావడంతో భువనేశ్వర్ జతగా.. ముజరబని నిప్పులు చెరగనున్నాడు.
Standing at 6’8”, bowling from a higher trajectory – Muzarabani is truly a 𝑩𝒍𝒆𝒔𝒔𝒊𝒏𝒈 to have in the side.
Pace, bounce, and that steep angle – make him hard to score off and he’s adding all the skills to our attack! 💥🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/f2KZmFsqOc
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 19, 2025