BCCI: ఆ వార్తలను కొట్టిపారేసిన బీసీసీఐ కార్యదర్శి
BCCI : ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. ఏసీసీ ఈవెంట్ల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. మీడియాకు వెల్లడిస్తామన్నారు.
న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ(BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్తో పాటు మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఇండియా పాల్గొనడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఏసీసీ ఈవెంట్లలో పాల్గొనాలా వద్దా అన్న అంశంపై బీసీసీఐలో ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ఏసీసీకి కూడా ఎటువంటి ప్రతిపాదన చేయలేదన్నారు. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా ఐపీఎల్, ఆ తర్వాత జరిగే ఇంగ్లండ్ సిరీస్పై ఉన్నట్లు దేవజిత్ సైకియా తెలిపారు. ఏసీసీ ఈవెంట్లను బహిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ ఊహాజనితమైనవే అన్నారు. తాము ఏ నిర్ణయాన్ని తీసుకున్నా మీడియా ద్వారా వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
BCCI Secretary Devajit Saikia to ANI says, “Since this morning, it has come to our notice about some news reports that the BCCI has decided not to participate in the Asia Cup and the Women’s Emerging Teams Asia Cup, both of which are ACC (Asian Cricket Council) events. Such news… pic.twitter.com/U0fZ9t8Ykl
— ANI (@ANI) May 19, 2025
ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. వచ్చే నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఏసీసీకి బీసీసీఐ చెప్పినట్లు వార్తలు వ్యాపించాయి. ఇక సెప్టెంబర్లో జరగనున్న పురుషుల ఆసియా కప్ టోర్నీ నుంచి కూడా ఇండియా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఆ టోర్నీని ఇండియానే నిర్వహించాల్సి ఉంది.
ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుతం అధిపతిగా మోషిన్ నఖ్వీ ఉన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ కూడా ఆయనే. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఏసీసీ చీఫ్ ఓ పాకిస్థాన్ మంత్రి, అలాంటి వ్యక్తి నేతృత్వంలో జరిగే టోర్నీల్లో ఇండియా పాల్గొనబోదని బీసీసీఐ పేర్కొన్నట్లు వార్తలు వ్యాపించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

