Lockie Ferugson : న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ లాకీ ఫెర్గూసన్(Lockie Ferugson) పెండ్లి చేసుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్ ఎమ్మా కొమోకి(Emma Komoki)తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫెర్గూసన్, కొమోకిల వివాహం ఫిబ్రవరి 2న జరిగింది. తన వివాహ పెండ్లి ఫొటోలను ఈ కివీస్ క్రికెటర్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
‘మిసెస్ ఫెర్గూసన్‌ను పరిచయం చేస్తున్నా’ అంటూ క్యాప్షన్ రాశాడు. దాంతో, న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. సైకోథెరపిస్ట్ (Psychotherapist) అయిన కొమోకి, ఫెర్గూసన్‌లు కొంత కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఎట్టకేలకు కొత్త ఏడాదిలో పెండ్లి చేసుకున్నారు. ఇప్పటివరకూ ఫెర్గూసన్ కివీస్ తరఫున ఒకే ఒక టెస్టు, 65 వన్డేలు, 36 టీ20లు ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫెర్గూసన్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 -21 ఎడిషన్‌లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 16వ సీజన్లో ఈ ఆల్‌రౌండర్ ట్రేడింగ్ పద్దతిలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు మారాడు. మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు.
ఫెర్గూసన్
అయితే.. అనూహ్యంగా గుజరాత్ 17వ సీజన్ ముందు అతడిని వదిలేసింది. దాంతో, 2024 మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) ఈ పేసర్‌ను రూ.2 కోట్లకు కొన్నది.