IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంపై త్వరలోనే ప్రకటన రానుంది. వేలం పాట జరిగే వేదిక ఖరారు కావడమే ఆలస్యం తేదీలను కూడా బీసీసీఐ వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru,)కు మరో తలనొప్పి మొదలైంది. విరాట్ కోహ్లీ మినహా ఏ ఒక్కరిని అట్టిపెట్టుకోవద్దని భావిస్తున్న బెంగళూరు యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం హుకూం జారీ చేస్తోంది.
ఆర్సీబీ స్క్వాడ్‌లో ఉన్న కర్నాటక ఆటగాళ్లను వదిలేయద్దని కన్నడ సర్కారు ఫ్రాంచైజీపై ఒత్తిడి తెస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస ప్రభుత్వం తీరు వల్ల 18వ సీజన్‌కు తమ వ్యూహం దెబ్బతింటుందని బెంగళూరు యాజమాన్యం వాపోతోంది.
New Auction Rules: Yay or Nay? 🤔
RCB think tank reveal what they like about #IPLMegaAuction rules and how it can affect different teams, on @bigbasket_com presents Bold Diaries.#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/iBAAdIzGiT
— Royal Challengers Bengaluru (@RCBTweets) October 20, 2024
పదిహేడు సీజన్లుగా ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారైనా కప్ కలను నిజం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకు తగట్టే పాత వాళ్లను వదిలేసి.. గెలుపు గుర్రాలను కొనాలని వేలం కోసం సిద్ధంగా ఉంది. అట్టిపెట్టుకుంటున్న ఆరుగురి జాబితాను బీసీసీఐకి పంపేందుకు అక్టోబర్ 31 ఆఖరి తేదీ కావడంతో ఎవరిని కొనసాగించాలి? అనే విషయమై ఫ్రాంచైజీ తర్జనభర్జనలు పడుతోంది. ఈ సమయంలోనే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మా రాష్ట్రం వాళ్లను మాతం వదిలేయొద్దు’ అని గట్టిగానే చెబుతోందని సమాచారం.
మనోజ్, విజయ్‌కుమార్
అంతేకాదు వేలంలో కూడా ‘గ్లోబల్ కంటే లోకల్ టాలెంట్’కే ఓటేస్తూ.. కర్నాటక ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సిద్ధరామయ్య సర్కార్ పట్టుబడుతోందట. ప్రస్తుతం ఆర్సీబీ స్క్వాడ్‌లో కర్నాటకు చెందిన వాళ్లు ఇద్దరే ఉన్నారు. ఒకరు పేసర్ విజయ్‌కుమార్ వైషాక్ (Vijaykumar Vyshak). మరొకరు ఆల్‌రౌండర్ మనోజ్ భాండగే (Manoj Bhandage). 17వ సీజన్లో విజయ్‌కుమార్ ఆదిలో పర్వాలేదనిపించినా తర్వాత ప్రభావం చూపలేదు. ఇక మనోజ్‌కు అయితే ఆడే అవకాశమే రాలేదు.