Maruti Swift Blitz | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ (Swift)’ బిల్ట్జ్ (Blitz) ఎడిషన్ ఆవిష్కరించింది. స్విఫ్ట్ బిల్ట్జ్ కారు ఐదు వేరియంట్లు – ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ఏఎంటీ, వీఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) ఏఎంటీ వేరియంట్లలో లభిస్తుంది. రేర్ అండర్ బాడీ స్పాయిలర్, స్పాయిలర్ ఆన్ బూట్, ఫాగ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, డోర్ విజర్, సైడ్ మౌల్డింగ్ తదితర ఫీచర్లు ఉంటాయి. లేయర్ వేరియంట్ స్విఫ్ట్ కార్ల విక్రయాలపై రూ.49,884 విలువైన ‘బ్లిల్ట్జ్’ కిట్ అందచేస్తోంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.8.02 లక్షల (ఎక్స్ షోరూమ్0 వరకూ పలుకుతుంది. మారుతి ఎరీనా డీలర్ల వద్ద లిమిటెడ్ పీరియడ్ ఈ స్విఫ్ట్ బిల్ట్జ్ లభిస్తుంది.
మారుతి స్విఫ్ట్ బిల్ట్జ్ కారు 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ 82 హెచ్పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్, సీఎన్జీ వేరియంట్ ఇంజిన్ 70 హెచ్పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఇటీవల స్విఫ్ట్ బిల్ట్జ్ తోపాటు బాలెనో రీగల్ ఎడిషన్, గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్, వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్, ఇగ్నిస్ రేడియన్స్ వేరియంట్లను మారుతి ఆవిష్కరించింది.