Alzheimer’s | దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయట..!
Alzheimer's : ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వాళ్లలో మీరు కూడా ఒకరా..? ఉదయాన్నే కాఫీ లేకపోతే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారా..? అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకొక శుభవార్త తెలియజేస్తోంది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడంవల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నూతన పరిశోధన ఫలితాలు 'ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్'లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన గురించి సమగ్రంగా తెలుసుకుందాం..
Alzheimer’s : ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి కాఫీ లేకుండా రోజును ప్రారంభించలేని వాళ్లలో మీరు కూడా ఒకరా..? ఉదయాన్నే కాఫీ లేకపోతే మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారా..? అయితే ఇటీవల జరిగిన ఓ అధ్యయనం మీకొక శుభవార్త తెలియజేస్తోంది. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడంవల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నూతన పరిశోధన ఫలితాలు ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన గురించి సమగ్రంగా తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.. కాఫీ ఎక్కువగా తీసుకోవడం జ్ఞాపకశక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఒక దశాబ్దకాలంపాటు 200 కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు. కాఫీకి, అల్జీమర్స్ వ్యాధి లక్షణాలకు మధ్య సంబంధం ఉన్నట్లు తేలిందని ఈ రిసెర్చ్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ సమంతా గార్డెనర్ చెప్పారు.
ఎక్కువ కాఫీ తీసుకునే అలవాటు ఉండి, జ్ఞాపకశక్తి లోపాలు లేనివాళ్లలో అల్జీమర్స్ ముప్పు చాలా తక్కువగా ఉన్నదని తాజా అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఎక్కువ కాఫీ తీసుకోవడం అనేది మెదడు పనితీరుకు సంబంధించి సానుకూల ఫలితాలను ఇచ్చింది. ప్రత్యేకించి ప్లానింగ్, స్వీయ నియంత్రణ, ఏకాగ్రతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ విధుల మెరుగుకు కాఫీ బాగా దోహదపడుతుందని తేలింది.
సాధారణంగా మెదడులో అమైలాయిడ్ ప్రొటీన్ అతిగా పోగుపడటం అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది. అయితే కాఫీ అతిగా తాగేవాళ్ల మెదడులో అమైలాడ్ ప్రొటీన్ నిదానంగా పోగుపడుతుందని పరిశోధనలో తేలింది. డాక్టర్ గార్డెనర్ మాట్లాడుతూ.. దీనిపై మరింత లోతైన పరిశోధన జరుగాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అల్జీమర్స్ వ్యాధి రాకను కాఫీ ఆలస్యం చేస్తుందనేది మాత్రం తాజా పరిశోధనతో స్పష్టమైందన్నారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కనిపించకుండా మేధో క్షీణత ప్రమాదం పొంచి ఉన్నవారికి ఎక్కువగా కాఫీ తీసుకోవడం బాగా ఉపయోగపడుతుందని గార్డెనర్ చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

