లక్నో: ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. (Man Attempts Suicide) 12వ అంతస్తు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. అయితే ఆ భవనంలోని కొందరు నివాసితులు వెంటనే స్పందించారు. అతడ్ని పట్టుకుని కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం నోయిడా సెక్టార్ 74లోని సూపర్‌టెక్ కేప్‌టౌన్ హౌసింగ్ సొసైటీ భవనం 12వ అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయేందుకు 21 ఏళ్ల వ్యక్తి ప్రయత్నించాడు. మెట్ల మార్గం వద్ద పిట్టగోడ అంచును పట్టుకుని ప్రమాదకరంగా వేలాడాడు.
కాగా, ఆ హౌసింగ్ సొసైటీలోని కొందరు నివాసితులు వెంటనే స్పందించారు. పరుగున ఆ అంతస్తుకు చేరుకున్నారు. పిట్టగోడ అంచు పట్టుకుని బయట వైపు ప్రమాదకరంగా వేలాడుతున్న అతడ్ని పట్టుకున్నారు. ఆత్మహత్యా యత్నం నుంచి ఆ వ్యక్తిని కాపాడారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూపర్‌టెక్ కేప్‌టౌన్ హౌసింగ్ సొసైటీలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆ వ్యక్తి ఇటీవల ఉద్యోగం కోల్పోయినట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన అతడు చనిపోవాలని భావించి ఇలా చేశాడని చెప్పారు. కాగా, అక్కడి నివాసితులు రికార్డ్ చేసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नोएडा के सुपरटेक केप टाउन में युवक ने किया आत्महत्या का प्रयास, Video @noidapolice #Noida #Suicide #NoidaPolice pic.twitter.com/4yrUpxDh42
— Tricity Today (@tricitytoday) October 21, 2024