IPL 2025 : ప్లే ఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Ryoal Challengers Bengaluru)కు పెద్ద షాక్. మే 23న చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ లక్నోకు తరలించింది. ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)తో తలపడాల్సింది. అయితే.. వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో, బెంగళూరు అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ‘అయ్యో.. సొంతగడ్డపై తమ జట్టు ఆటను చూడాలేకపోతున్నా’మని వాపోతున్నారు.
షెడ్యూల్ ప్రకారం మే 23న ఆర్సీబీ, ఆరెంజ్ ఆర్మీ జట్లు చిన్నస్వామిలో తలపడాల్సింది. ఇప్పటికే బెంగళూరు అభిమానులు టికెట్లు కొనుకున్నారు కూడా. అయితే.. ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న జరిగాల్సిన తొలి మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు రిఫరీలు తెలిపారు. దాంతో, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) దిగాలుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Due to adverse weather conditions, the IPL has moved the RCB-SRH match on May 23 from Bengaluru to Lucknow pic.twitter.com/AGS6ZzCXvP
— ESPNcricinfo (@ESPNcricinfo) May 20, 2025
కాబట్టి.. లీగ్ దశలో మరొక మ్యాచ్ వర్షార్పణం కావొద్దనే ఉద్దేశంతో బీసీసీఐ లక్నోలోని అటల్ బిహార్ వాజ్‌పేయి మైదానంను ఎంపిక చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న రజత్ పాటిదార్ బృందం.. విజయంతో నాకౌట్ పోరుకు వెళ్లాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. అభిషేక్ శర్మ(59) మెరుపులతో పంత్ సేనకు షాకిచ్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి ఆర్సీబీకి చెక్ పెట్టాలని వ్యూహాలు పన్నుతోంది. .
ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ వేదికపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3న జరగాల్సిన టైటిల్ పోరుకు ఈడెన్ గార్డెన్ ఆతిథ్యం ఇవ్వనుందనే వార్తలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి చెక్ పెట్టింది. వరసగా సమావేశాల అనంతరం చివరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లోనే ఫైనల్ ఆడించాలని తీర్మానించింది. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. దాంతో, ఇన్నిరోజులుగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు ఎండ్ కార్డ్ పడినట్టైంది.