నాగపూర్: ఆస్ట్రేలియాతో నాగపూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా కీలక వికెట్లను తీశాడు. తొలి రోజు రెండవ సెషన్లో జడేజా తన స్పిన్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నాడు. క్రీజ్‌లో సెటిల్ అయిన లబుషేన్, స్మిత్ వికెట్లతో పాటు రెన్షా వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లబుషేన్ స్టంప్ అవుట్ కాగా.. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టీవ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 44 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది.
Superb start to the session for #TeamIndia!@imjadeja gets 2 in 2 🙌🏻
Labuschagne & Renshaw depart and Australia are 4 down.
Live – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/GYFqxE536B
— BCCI (@BCCI) February 9, 2023