Renu Desai | తెలుగు ప్రేక్షకులకు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ.. హీరో పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. విడాకుల అనంతరం తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తూ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలతో మరింత బలమైన వ్యక్తిత్వంగా ఎదిగారు. మహిళలపై జరిగే అన్యాయాలు, సామాజిక అంశాలపై ఆమె తరచూ గొంతెత్తుతూ తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంటారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పిల్లలతో గడిపే మధుర క్షణాలు, వ్యక్తిగత ఆలోచనలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ట్రోల్స్ ఎదురైనా, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.
2025కి గుడ్‌బై చెబుతూ ఇటీవల తన ఫోటోలను షేర్ చేసిన రేణూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తాజాగా ఓ ప్రత్యేకమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఓ పసిపిల్లను ఒడిలో పెట్టుకొని ఆమె కనిపించారు. పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు” అంటూ ఆమె భావోద్వేగమైన క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్‌కు కామెంట్స్ బాక్స్‌ను ఆఫ్ చేయడం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. రేణూ ఒడిలో కనిపించిన ఆ పసిపాప ఎవరు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె ‘పదహారు రోజుల పండుగ’ అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సాయి కిరణ్ అడివి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా న్యూ ఇయర్ స్పెషల్‌గా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను కూడా రేణూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నటిగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా సాగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.