Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. భార్య నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ మళ్లీ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది (Dating Rumours). మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma)తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.
ఈ రూమర్స్ వేళ ఇటీవలే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా న్యూఇయర్ సందర్భంగా హార్దిక్.. తన ప్రేయసితో ఉన్న కొన్ని రొమాంటిక్ ఫొటోలను (Romantic Photos) షేర్ చేశారు. ఇద్దరూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. వీటితోపాటూ మరికొన్ని ఫొటోలను కూడా స్టార్ క్రికెటర్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోలకు ఎలాంటి క్యాప్షన్ జోడించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు ‘బెస్ట్ జోడీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. అందుకు అనుగుణంగానే వీరిద్దరూ అనేకసార్లు కలిసి కెమెరాకు చిక్కారు కూడా. ఇక ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా తమ ఇన్‌స్టా ఖాతాల్లో షేర్ చేస్తూ తమ బంధం గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read..
Usman Khawaja: సిడ్నీ టెస్టు తర్వాత.. ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్
న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్!
రితికాపై వేటు టాప్స్ స్కీమ్ జాబితా విడుదల