మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja).. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సిడ్నీలో జరగనున్న టెస్టు మ్యాచ్ అతనికి చివరిది కానున్నది. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ కానున్నట్లు అతను పేర్కొన్నాడు. 2011లో ఆసీస్ టీమ్‌లోకి వచ్చాడు ఖవాజా. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను సిడ్నీలోనే ఆడాడు. ఆదివారం ప్రారంభం అయ్యే సిడ్నీ టెస్టులో ఒకవేళ తుది జట్టుకు ఖవాజా ఎంపిక అయితే, అప్పుడు అతనికి అది చివరి మ్యాచ్ అవుతుంది. ఆస్ట్రేలియా జట్టు తరపు ఆడిన తొలి ముస్లిం ప్లేయర్ ఖవాజానే. గత 15 ఏళ్ల కెరీర్లో ఖవాజా వర్ణవివక్ష ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరపున ఇప్పటి వరకు 87 టెస్టులు ఆడాడు.
ఉస్మాన్ ఖవాజా పుట్టింది పాకిస్థాన్‌లో. కానీ చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకు వలసవెళ్లారు. పాకిస్థాన్‌కు చెందిన ముస్లింగా గర్వపడుతున్నట్లు అతను చెప్పాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున ఆడేది అనుమానమే అని చెప్పారని, కానీ తాను ఆ జట్టుకు ఆడి చూపించినట్లు తెలిపాడు. చిన్నతనంలోనే ఇస్లామాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
“Thank you for letting me live my dream, and for sharing it with me.”
Lovely, emotional words from Usman Khawaja, as he announced he will retire from international cricket after the Sydney Test.
Read more: https://t.co/xEXcXAZMcq
Catch every ball this summer. Live and ad-free… pic.twitter.com/0WVWQwJR8w
— ABC SPORT (@abcsport) January 2, 2026