లక్నో: నర్సింగ్ విద్యార్థినిపై లక్నో ప్రభుత్వ మెడికల్ ఇన్స్టిట్యూట్(Medical College)లో పనిచేస్తున్న ఇంటర్న్ డాక్టర్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లు డాక్టర్‌పై ఫిర్యాదు నమోదు అయ్యింది. నర్సింగ్ విద్యార్థిని ప్రైవేటు ఫోటోలను లీక్ చేస్తానని ఆ డాక్టర్ బెదిరించాడు. అయితే ఆ ఇంటెర్న్ డాక్టర్‌కు చెందిన బ్యాక్‌గ్రౌండ్, అడ్రస్‌ను వెరిఫై చేస్తున్నామని డీసీపీ విశ్వజీత్ శ్రీవాత్సవ్ తెలిపారు. అతన్ని ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు.
మెజిస్ట్రేట్ ముందు నర్సింగ్ స్టూడెంట్ వాంగ్మూలం రికార్డు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఖైసర్‌బాగ్ పోలీసు స్టేషన్ వద్ద ఆ డాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ స్టూడెంట్‌తో డాక్టర్ లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలని వత్తిడి చేయగా.. సోషల్ మీడియలో ఫోటోలు లీక్ చేస్తానని డాక్టర్ బెదిరించినట్లు తెలిసింది. గత రెండు వారాల్లో ఆ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి కేసు నమోదు కావడం ఇది రెండోది. లవ్ జిహాదీ కేసు కూడా ఆ ఇన్స్టిట్యూట్లో నమోదు అయ్యింది. పెళ్లికి ముందు మతం మార్చుకోవాలని ఓ డాక్టర్ మరో డాక్టర్‌ను వత్తిడి చేశాడు. ఆ బాధితురాలితో సీఎం యోగి మాట్లాడారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.