శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 05, 2020 , 09:17:51

టీ20ల నుంచి ర‌వీంద్ర జ‌డేజా ఔట్‌

టీ20ల నుంచి ర‌వీంద్ర జ‌డేజా ఔట్‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. మిగితా రెండు మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడు.  మిచ‌ల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో.. జ‌డేజా గాయ‌ప‌డ్డాడు.  బంతి అత‌ని త‌ల‌క త‌గ‌ల‌డం జ‌డేజా కాంక‌ష‌న్‌కు గుర‌య్యాడు.  దీంతో అత‌న్ని మిగితా రెండు మ్యాచ్‌ల‌కు దూరం చేస్తున్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది.  జ‌డేజా స్థానంలో జట్టులోకి శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. జాడేజాను ఇంకా అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టామ‌ని, అవ‌స‌రం అయితే మ‌రిన్ని స్కాన్స్ చేస్తామ‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  తొలి టీ20 మ్యాచ్‌లో.. స్టార్క్ బౌలింగ్‌లో జడేజా త‌ల‌కు ఎడ‌మ‌వైపు బంతి త‌గిలింది. డ్రెస్సింగ్ రూమ్‌లో బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ జ‌రిపిన క్లినిక‌ల్ డ‌యాగ్న‌సిస్ ద్వారా జ‌డేజా కాంక‌ష‌న్‌కు గురైన‌ట్లు తేల్చారు. క్యాన్‌బెరాలో జ‌రిగిన తొలి టీ20లో జ‌డేజా కీల‌క పాత్ర పోషించాడు.  కేవ‌లం 23 బంతుల్లో 44 ర‌న్స్ చేసి భార‌త్ భారీ స్కోర్‌ను అందించాడు. జ‌డేజా హిట్టింగ్ ఇండియా విక్ట‌రీలో కీల‌కంగా నిలిచింది. అయితే జ‌డేజా స్థానంలో కాంక‌ష‌న్ ప్లేయ‌ర్‌గా ఆడిన చాహ‌ల్ కూడా రాణించాడు.  


logo