ICC Champions Trophy | అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ మద్దతుతో 79 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ భారత్కు గట్టి పునాది వేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం న్యూజిలాండ్, టీం ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీం ఇండియా ఏడు వికెట్లు కోల్పోయింది. సారధి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వెంటవెంటనే ఔటయినా, శ్రేయాస్ అయ్యర్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులకు ఔటయ్యాడు. వీరితర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి హేన్రీ బౌలింగ్లో విలియమ్స్న్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో టీం ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.