Ravindra Jadeja : ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ఆరంభించేందుకు భారత బృందం ప్రాక్టీస్ సెషన్లతో బిజీగా గడుపుతోంది. సమిష్టిగా రాణించి సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది టీమిండియా. అయితే.. ఇంగ్లండ్‌లో సహచరులంతా హుషారుగా ఉంటే రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మాత్రం టీమ్ బస్సులో డల్‌గా ఉంటున్నాడు. అందుకు కారణం ఏంటి? అని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఎప్పుడూ బస్సులో పక్కనే కూర్చుండే రోహిత్ శర్మ లేకపోవడంతోనే జడేజా బోసిపోయినట్టుగా కనిపిస్తున్నాడట.
నిరుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై విఫలమైన రోహిత్ శర్మ మే 7న రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికాడు. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్తో సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఫుల్ షాట్లను ఎంజాయ్ చేసే అవకాశం కోల్పోయారు ఫ్యాన్స్. కానీ, జడేజా మాత్రం టీమ్ బస్సులో ఎల్లప్పుడూ జడ్డూ పక్కన కూర్చుండే వ్యక్తిని కోల్పోయాడు. విదేశీ పర్యటనల్లో అయినా.. స్వదేశంలో అయినా రోహిత్, జడ్డూలు పక్కపక్కనే కూర్చుండేవారు.
Ravindra Jadeja missing his bus partner. 💔 pic.twitter.com/4nRLTtspzP
— Selfless⁴⁵ (@SelflessCricket) June 7, 2025
ఆద్యంతం జోకులు పేలుస్తూ నవ్వించే హిట్‌మ్యాన్‌ను ఇంగ్లండ్ పర్యటనలో జడేజా ఎంతో మిస్ అవుతున్నాడు. ప్రస్తుతం అతడు టీమ్ బస్సులో ఒంటిరిగా కూర్చుంటున్నాడు. పక్క సీటు ఖాళీగాను ఉంటోంది. దాంతో, రోహిత్ రిటైర్మెంట్తో ఒంటరి అయిన జడేజా అంటూ అభిమానులు వీడియోలు పెడుతున్నారు. ఇంకేముంది ఈ ఆల్‌రౌండర్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ గైర్హాజరీలో స్పిన్ బౌలింగ్ విభాగానికి జడ్డూనే నాయకత్వం వహించనున్నాడు.
Jaddu was sitting alone in the team bus 💔
Ravindra Jadeja missing his buddy & travel partner, Rohit Sharma 🫂✨
Rohit used to sit with him in the team bus but now just an empty seat and memories🍃pic.twitter.com/HhSBRkKXUc
— 𝙇𝙪𝙘𝙠𝙮 (@luckycsk7) June 8, 2025
భారత సీనియర్ క్రికెటర్ అయిన రవీంద్ర జడేజా టెస్టుల్లో చెక్కుచెదరని రికార్డు నెలకొల్పాడు. అత్యధిక రోజులు నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగిన ఆల్‌రౌండర్‌గా జడ్డూ చరిత్ర సృష్టించాడు. మూడేళ్ల క్రితం అగ్రస్థానం కైవసం చేసుకున్న జడేజా ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నాడు. మే 14వ తేదీ నాటికి అతడు నంబర్ 1గా 1,151 రోజులు పూర్తి చేసుకున్నాడు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకాలం అగ్రస్థానంలో ఉన్న ఆల్‌రౌండర్ జడేజానే కావడం విశేషం.