సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీమ్ సభ్యులే రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మూడో రోజుల హైలైట్స్ను బీసీసీఐ సోమవారం షేర్ చేసింది. జడేజా 76 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మరోవైపు సిరాజ్ 2 వికెట్లు తీశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోచ్ రవిశాస్త్రి ప్లేయర్స్ ప్రాక్టీస్ మ్యాచ్ను పరిశీలించాడు. తొలి రెండు రోజుల్లో రిషబ్ పంత్ సెంచరీ (94 బంతుల్లో 121), శుభ్మన్ గిల్ 85 పరుగులు చేశారు. ఇషాంత్ 3 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు బుధవారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే టెస్ట్ కోసం ఇండియన్ వుమెన్స్ టీమ్ కూడా సిద్ధమవుతోంది.
.@imjadeja gets to his half-century (54* off 76) as play on Day 3 of the intra-squad match simulation comes to end.@mdsirajofficial is amongst wickets with figures of 2/22.#TeamIndia pic.twitter.com/3tIBTGsD3L
— BCCI (@BCCI) June 13, 2021
The third day of intra-squad match simulation was about settling down & finding that rhythm. 👍 👍 #TeamIndia
— BCCI (@BCCI) June 14, 2021
Here's a brief recap 🎥 👇 pic.twitter.com/WByZoIxzT6