ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు గుర్తుచేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ లెజెండరీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా ఇదే విషయం చెప్పాడు.
అశ్విన్‌ను ‘‘స్పిన్ బౌలింగ్ ప్రొఫెసర్’’ అన్న స్వాన్.. ఎడ్జ్‌బాస్టన్ వికెట్ స్పిన్ అవుతుందని, కానీ బౌన్స్ తక్కువగా ఉంటుందని వివరించాడు. ఈ పరిస్థితులను అశ్విన్ గొప్పగా ఉపయోగించుకుంటాడన్నాడు. 2018లో ఇక్కడ ఆడిన టెస్టులో అప్పటి కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను అశ్విన్ తెగ ఇబ్బంది పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తు చేసిన స్వాన్.. అశ్విన్‌ను ఆడించలేదంటే అది క్రేజీ నిర్ణయమే అవుతుందని అభిప్రాయపడ్డాడు.