Ravi Shastri : సచిన్ -అండర్సన్ ట్రోఫీ తొలి టెస్టు కోసం భారత బ్యాటింగ్ లైనప్ కూర్పు ఇంకా కొలిక్కి రాలేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఏక కాలంలో వీడ్కోలు పలకడంతో టాపార్డర్‌లో ఎవరిని ఆడించాలి? అనేది కొత్త సారథి శుభ్‌మన్ గిల్(Subhman Gill)కు తలనొప్పిగా మారింది. తొలి టెస్టుకు ఇంకా మూడు రోజులే ఉన్నందున మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) నంబర్ 3, నంబర్ 5లో ఎవరిని ఆడిస్తే జట్టుకు మంచిదో సూచించాడు.
ఈ దశాబ్దంలో రోహిత్, కోహ్లీలు లేకుండా తొలిసారి భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. దాంతో, వీళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్ధులైన ఆటగాళ్ల వేటలో పడ్డారు కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్. ఈ నేపథ్యంలో రవి శాస్త్రి కీలక సూచలను చేశాడు. ఓపెనింగ్ జోడీగా యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్‌ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు. విరాట్ రిటైర్మెంట్తో ఖాళీ అయిన మూడో స్థానంలో సాయి సుదర్శన్ సరైన ఎంపిక అని శాస్త్రి తెలిపాడు.
అయితే.. యశస్వీ ఎంట్రీకి ముందు హిట్‌మ్యాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ గిల్ 4వ స్థానంలో, ఇంగ్లండ్ లయన్స్‌పై ద్వి శతకంతో చెలరేగిన కరుణ్ నాయర్ 5వ స్థానంలో ఆడితే బెటర్ అని మాజీ క్రికెటర్ వెల్లడించాడు. పేస్ ఆల్రౌండర్లుగా నితీశ్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్లు జట్టులో ఉండాలని శాస్త్రి సూచించాడు. అంతేకాదు జూన్ 20న జరుగబోయే తొలి టెస్టుకు వేదికైన లీడ్స్‌లోని హెడింగ్లేలో వాతావరణం పేసర్లకు అనుకూలిస్తుందని.. మూడో పేసర్‌గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణల మధ్య పోటీ తప్పదని చెప్పాడీ వెటరన్.