RTC Staff Honesty : విధి నిర్వహణలో గద్వాల డిపోలో పనిచేస్తున్న టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. బస్సులో మరిచిపోయిన రూ.27 లక్షల విలువైన ఆభరణాలున్న బ్యాగ్‌ను కండక్టర్ సూరిబాబు, డ్రైవర్ పరుశురాములు ప్రయాణికులకు అందజేశారు. నిజాయతీగా ఉండి.. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన సూరిబాబు, పరుశురాములును టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఈ ఇద్దరిని సన్మానించారు.
గద్వాల డిపో బస్సు ఈ నెల 5న కర్నూల్ నుంచి గద్వాలకు బయలుదేరింది. ఆ బస్సు ఎక్కిన ఇద్దరు ప్రయాణికులు గద్వాలకు బస్సు చేరుకోగానే దిగి వెళ్లిపోయారు. అయితే.. హడావిడిలో వాళ్లు రూ.27 లక్షల విలువైన నగలు, నగదు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను బస్సులో మరిచిపోయారు. బస్సులో ఆ బ్యాగ్‌ను గమనించిన కండక్టర్, డ్రైవర్.. దానిని తెరిచి చూశారు. అందులో 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్‌ను గుర్తించారు. వెంటనే ఆర్టీసీ అధికారులకు సమాచారం చేరవేశారిద్దరు. బ్యాగులో ఉన్న వివరాల ఆధారంగా ప్రయాణికులకు సమాచారం అందించారు అధికారులు. అనంతరం ఆ బ్యాగును సదరు ప్రయాణికులకు అందజేశారు.
సమర్థంగా విధులు నిర్వర్తిస్తూనే నిజాయతీగా వ్యవహరించి.. ఆర్టీసీపై మరింత నమ్మకం పెంచేలా చేశారని సూరిబాబు, పరశురాములును ఎండీ సజ్జనార్, ఉద్యోగులు ప్రశంసించారు. బస్‌భవన్‌లో జరిగిన సన్మాన
ఈ కార్యక్రమంలో ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషాదేవి, గద్వాల డీఎం సునీత, తదితరులు పాల్గొన్నారు.