Ravi Shastri : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య కీలక పోరుకు వేళైంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఇరుజట్లు పోటాపోటీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం(IST) ప్రకారం శుక్రవారం ఉదయం 7:50 గంటలకు తొలి టెస్టు మొదలు కానుంది. భారత బ్యాటింగ్ యూనిట్‌కు, కంగారూల పేస్ దళానికి మధ్య రసవత్తర పోరు అభిమానులను అలరించడం ఖాయం. పెర్త్‌లో విజయంపై కన్నేసిన భారత్, ఆసీస్‌లు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక.. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్‌గా వ్యవహరించనున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తన ముద్ర వేయాలని పట్టుదలతో ఉన్నాడు.
పెర్త్ మైదానంలో ఘనమైన రికార్డు లేని టీమిండియా ఈసారి విజయంతో సిరీస్‌ను ఆరంభించాలి అనుకుంటోంది. అయితే.. కయ్యానికి కాలు దువ్వే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారత ఆటగాళ్లు ఎలా బదులిస్తారు? గత పర్యటనల్లో బుల్లెట్ బంతులతో కంగారూ బ్యాటర్లను వణికించిన బుమ్రా ఇప్పుడు కెప్టెన్‌గా తన వ్యూహాలను ఎలా అమలు చేస్తాడు? అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో యార్కర్ కింగ్ బుమ్రాకు మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri ) కీలక సూచన చేశాడు.
🗣️🗣️ 𝙏𝙝𝙚𝙧𝙚’𝙨 𝙣𝙤 𝙜𝙧𝙚𝙖𝙩𝙚𝙧 𝙝𝙤𝙣𝙤𝙪𝙧 𝙩𝙝𝙖𝙣 𝙩𝙝𝙞𝙨.
Captain Jasprit Bumrah is charged 🆙 to lead from the front in Perth ⚡️⚡️#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/0voNU7p014
— BCCI (@BCCI) November 21, 2024
‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని చూస్తారు. ఒకవేళ అలా చేయగలిగితే జట్టు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోతుందని వాళ్ల నమ్మకం. అందుకని బుమ్రా వాళ్ల వ్యూహంలో పడిపోవద్దు. అతడు ఒక పేసర్‌ను అనే ఆలోచనతోనే బౌలింగ్ చేయాలి. అలాగైతేనే అతడు కెప్టెన్‌గా విజయవంతం కాగలడు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.
బుమ్రా సారథ్యం విషయానికొస్తే.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు జట్టును నడిపించడం ఇది రెండోసారి. 2022లో ఇంగ్లండ్‌తో బర్మింగ్హమ్లో జరిగిన మ్యాచ్ ముందు రోహిత్ శర్మ కరోనా (Covid -19) బారిన పడ్డాడు. దాంతో, కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న బుమ్రా ఆకట్టుకున్నాడు. కానీ, జో రూట్, జానీ బెయిర్‌స్టోలు అజేయ శతకాలు బాదడంతో భారత్‌కు ఇంగ్లండ్ షాకిచ్చింది. అలా.. తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకున్న బుమ్రా కెప్టెన్‌గా తొలి విజయం ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు.
Jasprit Bumrah holds the best bowling average among bowlers visiting Australia (minimum 30 wickets) since 2000. pic.twitter.com/qUmOoC7MCX
— CricTracker (@Cricketracker) November 20, 2024