Ravi Shastri : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీకి మరో వారమే ఉంది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తే తప్ప టీమిండియాకు మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ఆడే అవకాశం లభించదు. దాంతో, ఎలాగైనా సరే కంగారూలను మరోసారి కంగారెత్తించాలని భారత జట్టు నెట్స్‌లో చెమటోడ్చుతోంది. ఈ ట్రోఫీలో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) జట్టుకు కీలకం కానున్నాడు. ఒకవేళ సిరీస్ ఓపెనర్ అయిన పెర్త్ టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైతే విరాట్ మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అయితే.. స్వదేశంలో న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లో ఒకటే హాఫ్ సెంచరీ బాదిన విరాట్ ఫామ్‌పై అందోళనతో ఉన్నారు.
కోహ్లీ ఈసారి బలహీనంగా ఉన్నాడని, అతడి ఆటలో మునుపట పస తగ్గిందని.. ఐదేండ్లలో కేవలం రెండే రెండు సెంచరీలు కొట్టాడని.. ఆసీస్ మాజీ క్రికెటర్లు మైకేల్ క్లార్క్, రికీ పాంటింగ్‌లు అతడి గురించి ఇలా పలురకాలుగా మాట్లాడుతున్నారు. అయితే.. వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగడం ఖాయమని భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Will Virat Kohli prove all his doubters wrong in Australia?#AUSvIND #India #Cricket #ESPNCricinfo pic.twitter.com/2MtpchJqXs
— ESPNcricinfo (@ESPNcricinfo) November 14, 2024
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత జట్టుకు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకం. ఆసీస్ గడ్డపై పేస్, బౌన్సీ పిచ్‌లపై శతకాలతో విరుచుకుపడిన కోహ్లీ ఈసారి ఎలా ఆడుతాడు? అనేది అందరికీ ప్రశ్నగా మారింది. అందుకు కారణం న్యూజిలాండ్‌పై విరాట్ ఒక్కటంటే ఒక్క భారీ స్కోర్ చేయలేదు. అయినా సరే విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై పరుగుల వరద పారిస్తాడని మాజీ కోచ్ రవి శాస్త్రి అంటున్నాడు.
Last time BGT trophy Winning Moments.
Look that all Indian team emotion. #ShubmanGill #RishabhPant#INDvAUS
— JassPreet (@JassPreet96) November 13, 2024
‘రాజు తన సామ్రాజ్యానికి తిరిగొచ్చాడు. విరాట్‌ను విమర్శించేవాళ్లను నేను చెప్పే మాట ఇదొక్కటే. ఆస్ట్రేలియా గడ్డపే విధ్వంసక ఇన్నింగ్స్‌లో రాజు అనే పేరు తెచ్చుకున్నావు. క్రీజులోకి వెళ్లిన ప్రతిసారి నువ్వు ఒక కింగ్ అనే విషయం నీతో పాటు ప్రత్యర్థుల మెదళ్లలోనూ తిరుగుతూనే ఉంటుంది’ అని కోహ్లీని ఉద్దేశించి రవి శాస్త్రి మాట్లాడాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో ఈమధ్య పెద్దగా రాణించని కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. కంగారూ ఆటగాళ్లు కవ్విస్తే చాలు.. రెచ్చిపోయి ఆడే కోహ్లీ గత పర్యటనల్లో జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. అయితే.. ఫామ్‌లో ఉన్నా లేకున్నా కోహ్లీ జట్టులో ఉన్నాడంటే చాలు ఆస్ట్రేలియన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఎందుకంటే.. యువ క్రికెటర్‌గా, ఆపై కెప్టెన్‌గా ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు దీటుగా బదిలిస్తూ.. అనంతరం బ్యాటుతో దంచేసిన విరాట్ మరోసారి ఉగ్రరూపం దాలిస్తే టీమిండియాకు తిరుగుండదని కోట్లాదిమంది అభిమానులు ముక్తకంఠంతో అంటున్న మాట.
Virat’s Masterclass: 2️⃣ Centuries in Style 🔥
From struggles to a spectacular comeback, King Kohli lights up the #ToughestRivalry with two stunning centuries against Australia. 🤯
📺 Watch 👉 #AUSvINDonStar | 1st Test starts on FRI, 22 NOV pic.twitter.com/m93uQYdQoq
— Star Sports (@StarSportsIndia) November 5, 2024