Prabhas – Allu arjun | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ల ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బయటకు చెప్పకపోయిన అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు ఈ స్టార్ హీరోలు. అయితే తాజాగా ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు అల్లు అర్జున్. ఇందులో బాలకృష్ణ తెరపై ప్రభాస్‌ను చూపిస్తూ.. ప్రభాస్‌పై నీ ఒపినియన్ ఏంటి అని అడుగుతాడు.
దీనికి అల్లు అర్జున్ చెబుతూ.. ప్రభాస్‌ను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చూసిన ఒకటే మాట నాది. ప్రభాస్ ఆరడుగుల బంగారం అంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇదే వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి.. అల్లు అర్జున్‌ని చెప్పమన్నాడు. ఇక మావయ్య గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఓ లీడర్‌గానే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. కాగా దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Hear the answers straight from the man himself! 😎😎
Episode lo entertainment taggede le 🔥 Fire lanti episode Loading.#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #UnstoppableWithNBK #JaiBalayya #UnstoppableAlluArjun #IddaruFiree #PawanKalyan #Prabhas@alluarjun pic.twitter.com/W1JCUfYHl0
— ahavideoin (@ahavideoIN) November 14, 2024