IPL 2023 | ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో రష్మిక, తమన్న డాన్స్ షో.. పాటలతో హోరెత్తించనున్న అర్జిత్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు.
IPL 2023 : ప్రపంచంలోనే అతిపెద్ద టీ 20లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా, కన్నులపండువగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అందుకని సినీ సెలబ్రిటీలు, బాలీవుడ్ సింగర్స్‌తో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఇండియా క్రష్‌గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 31న) ఐపీఎల్ పండుగ షురూ కానుంది. సాయంత్ర 5ః30 గంటల నుంచి ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సీజన్ మొదటి మ్యాచ్‌లో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ”
Get ready for a dazzling and unforgettable evening 🎇@iamRashmika will be performing LIVE during the #TATAIPL Opening Ceremony at the biggest cricket stadium in the world – Narendra Modi Stadium! 🏟️
🗓️ 31st March, 2023 – 6 PM on @StarSportsIndia & @JioCinema pic.twitter.com/nNldHV3hHb
— IndianPremierLeague (@IPL) March 30, 2023
Join @tamannaahspeaks in the incredible #TATAIPL Opening Ceremony as we celebrate the biggest cricket festival at the biggest cricket stadium in the world – Narendra Modi Stadium! 🏟️ 🙌
31st March, 2023 – 6 PM IST on @StarSportsIndia & @JioCinema
Make sure to tune in & join! 👌 pic.twitter.com/u9HtOcD9tm
— IndianPremierLeague (@IPL) March 29, 2023
ఈ సీజన్ ప్రత్యేకతలివే..
గత సీజన్లతో పోల్చితే ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొన్నికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అవేంటటే.. ప్రతి జట్టు సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రతి టీమ్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకొనే వెసులుబాటు ఉంది. అంతేకాదు టాస్ తర్వాత కూడా తుది జట్టులో మార్పులు చేసుకొనే వీలుంది.
Get ready to rock & roll! 🎶
To celebrate the biggest cricket festival, @arijitsingh will be performing LIVE during the #TATAIPL Opening Ceremony at the biggest cricket stadium in the world – Narendra Modi Stadium! 🏟️
🗓️ 31st March, 2023 – 6 PM on @StarSportsIndia & @JioCinema pic.twitter.com/K5nOHA2NJh
— IndianPremierLeague (@IPL) March 29, 2023
ఇవి కూడా చదవండి
“Josh Hazlewood | ఆస్ట్రేలియన్లు ద్వేషించే భారత బ్యాటర్ అతడే : హేజిల్‌వుడ్”
“AB de Villiers | ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవంతో కళ్లలో నీళ్లు తిరిగాయి : డివిల్లియర్స్”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

