AB de Villiers : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీ నుంచి అరుదైన గౌరవం లభించడంతో మిస్టర్ 360 ప్లేయర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ‘ఆ రోజు చిన్నస్వామి స్టేడియం అభిమానులతో నిండిపోయింది. మా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలోకి అడుగుపెట్టగానే వాళ్లందరిని చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం అడుగు వేయడం కూడా కష్టంగా అనిపించింది’ అని డివిల్లియర్స్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
పదహారో సీజన్ కొత్త జెర్సీ ఆవిష్కరణ అనంతరం డివిల్లియర్స్, విండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ స్టార్ ప్లేయర్స్‌కు చోటు లభించింది. తమ జట్టుకు సేవలందించినందుకు వీళ్లను గార్డ్ ఆఫ్ హానర్‌తో ఫ్రాంఛైజీ గౌరవించింది. ఈ సందర్భంగా ‘మళ్లీ ఆర్సీబీకి ఆడతారా?’ అని వీళ్లను సరదాగా ఆడిగారు. అందుకు గేల్.. ‘నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. డివిల్లియర్స్ మాత్రం ‘ప్రస్తుతం టీమ్ చాలా బాగా ఉంది. ఈ టైమ్‌లో మేము జట్టులో సరిపోతామని అనుకోవడం లేదు’ అని తెలివిగా బదులిచ్చాడు.