IPL 2025 : బ్యాటర్ల మెరుపులతో భారీ స్కోర్లు నమోదవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) 18వ సీజన్లో కొందరు స్టార్ బౌలర్లు తమ ముద్ర వేస్తున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్ల జోరుకు కళ్లెం వేస్తున్నారు. గుజరాత్ టైటన్స్(Gujarat Titans)కు ఆయువుపట్టులా మారిన రషీద్ ఖాన్ (Rashid Khan) వ్యక్తిగతంగా అరుదైన మైలురాయికి చేరుకున్నాడు.
మిస్టరీ బౌలింగ్‌తో ఇరుకున పెట్టే ఈ స్పిన్నర్ 150 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మార్చి 25న నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యాను ఔట్ చేసి.. 150 క్లబ్లో చేరాడీ అఫ్గనిస్థాన్ సారథి.
Milestone Accomplished 💪
Rashid Khan joins an elite list of bowlers with 1️⃣5️⃣0️⃣ #TATAIPL wickets 🔥
Can he guide #GT to a win in their season opener? #GTvPBKS | @gujarat_titans | @rashidkhan_19 pic.twitter.com/fYe1rdnA2q
— IndianPremierLeague (@IPL) March 25, 2025
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) రికార్డును రషీద్ బద్ధలు కొట్టాడు. ముంబై యార్కర్ కింగ్ కంటే వేగంగా 150 వికెట్ల ఫీట్ సాధించాడీ స్పిన్నర్. బుమ్రా 124 మ్యాచుల్లో ఈ మైలురాయికి చేరుకుంటే.. రషీద్ కేవలం 122 మ్యాచుల్లోనే 6.86 ఎకానమీతో నూట యాభై వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తక్కువ మ్యాచుల్లోనే 150 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు రషీద్. వెటరన్ పేసర్ లసిత్ మలింగ 105 మ్యాచుల్లో.. యజ్వేంద్ర చాహల్ 118 మ్యాచుల్లో ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
Rashid Khan the Magician 🔥
The leg-spinner becomes the 3rd fastest to 150 wickets in IPL history 👏 pic.twitter.com/jr2oWbDqIE
— Cricket.com (@weRcricket) March 25, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా 2017లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు రషీద్. ఐదు సీజన్లు ఆరెంజ్ ఆర్మీతో కొనసాగిన అతడిని 2022 వేలంలో గుజరాత్ టైటాన్స్ భారీ ధరకు కొన్నది. ఈ ఏడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలో బ్యాటుతో, బంతితో రాణించిన రషీద్.. తమ ఫ్రాంచైజీ టైటిల్ విజేతగా అవతరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో రషీద్ అత్యుత్తమ ప్రదర్శన విషయానికొస్తే.. 2023 సీజన్లో అతడు బంతితో చెలరేగిపోయాడు. ఈ ఎడిషన్‌లో 17 ఇన్నింగ్స్‌ల్లో 20.44 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు.