IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ సీజన్‌కు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. మార్చి 22న మొదలైన 18వ సీజన్ ఆరంభంలోనే రికార్డు స్కోర్లు నమోదు అవుతున్నాయి. ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. పవర్ హిట్టర్ల విధ్వంసంతో పవర్ ప్లేలోనే స్కోర్ 70 దాటేస్తోంది. 10 ఓవర్లు వచ్చేసరికే స్కోర్‌బోర్డు మీద 100కు పైగా పరుగులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ తరహా రన్‌రేటుతో పరుగులు రావడం ఇదే మొదటిసారి.
ఓపెనర్లు, టాపార్డర్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతు ఓవర్‌కు సగటున 10.37 రన్‌రేటుతో రన్స్ సాధిస్తున్నారు. గత ఎడిషన్‌తో పోల్చితే.. ఆటగాళ్ల దూకుడు దాదాపు 20 శాతం ఎక్కువగా ఉంది. 2024 సీజన్లో 32.6 శాతం ఇంటెంట్ ఉంటే.. ఈసారి 54.3 శాతం కసితో ఆడుతున్నారు హిట్టర్లు. ప్రతి 3.9 బంతికి ఒక బౌండరీ వస్తోంది. 9.9 బంతికి సిక్సర్ వస్తోంది. 17వ సీజన్లో మాత్రం 5.3 బంతికి ఫోర్, 13.7 బంతులకు సిక్సర్ వచ్చింది. అందుకే.. ఈసారి 10కి పైగా రన్‌రేటుతో ఆడుతున్నాయి అన్ని జట్లు.
Flying start all right 💥🧡 pic.twitter.com/szX3KadJTh
— Ishan Kishan (@ishankishan51) March 23, 2025
పదిహేడో సీజన్లో 41 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు కాగా.. వాటిలో పది 250 ప్లస్ ఉన్నాయి. అయితే.. 18వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 286 రన్స్ బాదింది. ఉప్పల్ స్టేడియంలో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో ఐపీఎల్‌లోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. విశాఖపట్టణంలో లక్నో సూపర్ జెయింట్స్ 208 రన్స్ కొట్టగా.. అశుతోష్ శర్మ(66 నాటౌట్) మెరుపులతో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది.
97 but for us 💯🥹 #GTvPBKS pic.twitter.com/Bljo8KpXqS
— Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2025
ఇక అహ్మదాబాద్‌లో శ్రేయస్ అయ్యర్(97 నాటౌట్), శశాంక్ సింగ్(44 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా.. 243 పరుగులు కొట్టింది పంజాబ్ కింగ్స్. సీజన్ మొదలైన 5 మ్యాచుల్లోనే ఈ రేంజ్లో రెచ్చిపోతున్న హిట్టర్లు.. తర్వాతి మ్యాచుల్లో మరింత చెలరేగితే ఈసారి 300 స్కోర్ సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు.