పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో రెండో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 255/1తో నిలిచింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (114 బ్యాటింగ్) శతకంతో ఆకట్టుకోగా హిమతేజ (62 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.