హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ సోమవారం ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులతో కొనసాగుతున్నది. చేతిలో మూడు వికెట్లు ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
కెప్టెన్ రాహుల్‌సింగ్(59) అర్ధసెంచరీతో మెరువగా, హిమతేజ (41) ఆకట్టుకున్నారు. లామ్రోర్ (2/30), అశోక్‌శర్మ (2/33) రెండేసి వికెట్లు తీశారు. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 221/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన రాజస్థాన్ 269 పరుగులకు ఆలౌటైంది. త్యాగరాజన్ (3/64), మిలింద్ (3/44) మూడేసి వికెట్లు తీశారు.