Rohit Sharma | రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మ్యాచ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో మ్యాచ్‌ను చూసేందుకు చాలామంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. క్రీజులో ఎక్కువగా సేపు చూడాలన్న అభిమానుల ఆశ తీరలేదు. రోహిత్ కేవలం మూడు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న హిట్‌మ్యాన్ రంజీల్లోనూ విఫలం కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ మ్యాచుల్లో, దేశవాళీ మ్యాచుల్లో ప్రదర్శన ఏమాత్రం బాగా లేదని మండిపడుతున్నారు. రోహిత్ ప్లేస్‌లో తుది జట్టుకు దూరమైన ఆయుష్ మాత్రేకు అభిమానులు మద్దతు ప్రకటించారు. యువ ఆటగాడి స్థానాన్ని రోహిత్ ఆక్రమించుకున్నాడని అభిమానులు విమర్శించారు.
I feel bad for 17 years old Ayush Mhatre who got dropped from Mumbai squad because of Selfish Sharma….
Ayush scored 116 in his last Ranji match & has been in sublime touch this season. Rohit should let the future of Indian cricket takeover now & retire from tests today itself! pic.twitter.com/boaLIPgiv7
— Rajiv (@Rajiv1841) January 23, 2025
వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్‌పై చాలా అంచనాలున్నాయి. దేశవాళీ టోర్నీలో భారీగా పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు భావించారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రోహిత్ మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. ఆయుష్ మాత్రే ప్లేస్‌లో రోహిత్ శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. ముంబయి తరఫున ఆడిన చివరి రంజీ మ్యాచ్‌లో ఆయుష్ సెంచరీ సాధించాడు. సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆయుష్ ఈ సీజన్లో రంజీలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 45.33 సగటుతో 408 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నది. విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున తన చివరి మ్యాచ్‌లో 148 పరుగులు కూడా చేశాడు. రంజీ డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఫామ్‌లో లేని రోహిత్ కోసం ఆయుష్‌ను పక్కన పెట్టడం ఏమాత్రం అభిమానులకు రుచించలేదు.
Ayush mhatre, a promising youngster who scored 100 in the last ranji match and VHT but this guy got dropped just because a selfless player wants to play ranji. He’s the Most selfish cricketer pic.twitter.com/2iEmGgnbo4
— leisha (@katyxkohli17) January 23, 2025
మ్యాచ్‌లో ఆయుష్‌ను తుదిజట్టు నుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయి నుంచి దేశవాళీ క్రికెట్ వరకు రోహిత్ శర్మ ఓ యువ క్రికెటర్ స్థానాన్ని తినేశాడని ఓ యూజర్ ఆరోపించాడు. ఎలాంటి తప్పు చేయకుండానే ఆయుష్‌ను తప్పించారని విమర్శించాడు. గత రంజీ మ్యాచ్, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ చేసిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే అని.. నిస్వార్థంగా రంజీలు ఆడాలనుకుంటున్న యువ ఆటగాడిని తొలగించారని.. రోహిత్‌ను అత్యంత స్వార్థపూరిత క్రికెటర్ అంటూ లీసా అనే యూజర్ ఆరోపించారు. మరో నెటిజన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా.. డొమెస్టిక్ క్రికెట్ అయినా సేమ్ టూ సేమ్ అంటూ రోహిత్‌పై సెటైర్లు వేశారు.
Ayush Mhatre scored 148 runs for Mumbai in their last ranji trophy match. They dropped him for Rohit sharma. As a Mumbaikar I am truly hurt by this superstar culture pic.twitter.com/0vNWpAI9yw
— A (@_shortarmjab_) January 23, 2025
From International cricket to domestic, Rohit sharma eating Youngster’s place is permenant. Ayush Mahtre did nothing wrong to get dropped.
We lost as a Nation 💔 pic.twitter.com/HQPV6JIhEZ
— Fearless🦁 (@ViratTheLegend) January 23, 2025