హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్ పోరాటపటిమతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు 100/2తో ఆట ఆరంభించిన ఛత్తీస్‌గఢ్‌కు సారథి అమన్‌దీప్ (176 నాటౌట్) వీరోచిత శతకంతో 411/8 స్కోరు చేసింది.
పదో నెంబర్ బ్యాటర్ దేవ్ ఆదిత్య సింగ్ (79*)తో కలిసి అమన్‌దీప్.. పదో వికెట్‌కు 260 బంతుల్లో 193 రన్స్ జతచేయడం విశేషం. కాగా గ్రూప్ ‘ఏ’లో జార్ఖండ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సాధించిన ఆంధ్ర క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.