హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీ ఎలైట్ 2024లో భాగంగా గ్రూప్-బీలో ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలిరోజు హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (124 నాటౌట్) శతకంతో మెరిశాడు.
నగరంలోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. హిమతేజ (36), అభిరాత్ (35) ఫర్వాలేదనిపించారు. తన్మయ్‌తో పాటు రాహుల్ రాధేశ్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.