WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు సీజన్లుగాకోచింగ్ ఇస్తున్న కాదని కొత్తగా ప్రధాన కోచ్‌ను నియమించుకుంది. తమిళనాడుకు చెందిన మలోలానన్ రంగరాజన్ (Malolan Rangarajan)ను పగ్గాలు అప్పగించింది. ల్యూక్ విలియమ్స్(Luke Williams) స్థానంలో అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఉన్నట్టుండి కొత్త కోచ్ నియామకంపై సందేహాలకు తావిచ్చింది. అయితే.. ఆస్ట్రేలియాకు చెందిన విలియమ్స్ మహిళల బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు కోచింగ్ ఇస్తున్న అతడు డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. అందుకే రంగరాజన్‌ను ఎంపిక చేశామని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టతనిచ్చింది.
🚨 OFFICIAL ANNOUNCEMENT
Malolan Rangarajan, a key member of the RCB support staff for the last 6 years in various roles, has now been appointed as 𝗛𝗘𝗔𝗗 𝗖𝗢𝗔𝗖𝗛 for the upcoming WPL cycle.
More details, and WPL retentions announcement soon… 🤩#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/PLiDY9sxef
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 6, 2025
తమిళనాడు మాజీ క్రికెటర్ అయిన రంగరాజన్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌పై మంచి పట్టుంది. గత ఆరేళ్లలో ఆయన పలు జట్లకు కోచింగ్ ఇచ్చాడు. రెండేళ్లుగా మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆయన అనుభవం ఆర్సీబీకి ఉపయుక్తం కానుందని భావించిన యాజమాన్యం కొత్త కోచ్‌గా తీసుకుంది. రంగరాజన్‌ను కోచ్‌గా నియమించడం పట్ల బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సంతోషం వ్యక్తం చేసింది.
‘రంగరాజన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో క్రికెట్ గురించి చర్చించడాన్ని ఎంతో ఆస్వాదించేదాన్ని. గత మూడేళ్లుగా ఆయన మహిళా క్రికెటర్లపై ఆయన సానుకూల దృక్పథంతో ఉంటూ వస్తున్నాడు. అందుకే.. రంగరాజన్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఆయన మార్గనిర్దేశనంలో ఆర్సీబీ గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా’ అని మంధాన వెల్లడించింది. రెండో సీజన్లో ఆర్సీబీని విజేతగా నిలిపిన మంధాన టీ20ల్లో ఫ్రాంచైజీ కలను సాకారం చేసింది. అయితే.. మూడో సీజన్లో మాత్రం నిరాశపరిచిన బెంగళూరు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
𝘐𝘯 𝘴𝘺𝘯𝘤 𝘧𝘰𝘳 𝘴𝘶𝘤𝘤𝘦𝘴𝘴! 🎯
𝗦𝗺𝗿𝗶𝘁𝗶 𝗠𝗮𝗻𝗱𝗵𝗮𝗻𝗮 𝗯𝗮𝗰𝗸𝘀 𝗻𝗲𝘄 𝗥𝗖𝗕 𝗵𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗠𝗮𝗹𝗼𝗹𝗮𝗻 𝗥𝗮𝗻𝗴𝗮𝗿𝗮𝗷𝗮𝗻
“I want to congratulate Malolan Rangarajan on his appointment as Head Coach of RCB in the WPL. I share great rapport with him… pic.twitter.com/723z3ayYsK
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 6, 2025